Ayyannapatrudu and Vijaysai Reddyప్రజల ప్రాణాలంటే ఈ వైసీపీ నాయకులకు ఎంత చిన్న చూపో విజయసాయిరెడ్డి తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తోనే అర్ధమవుతుందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రజల చావులంటే విజయసాయికి ఇంత హేళనా? అంటూ ప్రశ్నిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.

జంగారెడ్డిగూడెం కల్తీ సారా తాగి చనిపోయిన వారందరూ వృద్దులు., అనారోగ్య సమస్యలతో మరణించారా.? మీ దృష్టిలో వృధాప్యం – అనారోగ్యం అంటే ఏమిటో? ఏపీ ప్రజలకు చెప్పాల్సిన సమయం వచ్చేసింది సాయిరెడ్డి అంటూ విమర్శలతో టీడీపీ సభ్యులు విరుచుకుపడుతున్నారు.

“అనారోగ్యం., వృధాప్య సమస్యలతో ఎవరు చనిపోయినా, రాబందులాగా చంద్రబాబు అక్కడ వాలిపోతారు, విషాదంలో ఉన్న వారిని మరింత క్షోభకు గురి చేస్తారు, చావులను వివాదం చేయడం దివాళాకోరు రాజకీయం అవుతుందని” విజయసాయిరెడ్డి పోస్ట్ చేసారు. రాష్ట్రంలో ఏం జరిగినా అది చంద్రబాబు చలవే అనడం సాయిరెడ్డికి కొత్తేమీ కాదుగా!

చావులు – వివాదాలు -ప్రచారాలు… గురించి మీరా మాట్లాడేది అంటూ ప్రత్యక్షంగానూ, సోషల్ మీడియాలోనూ టీడీపీ విమర్శల జోరు పెంచింది. అసలు చావుల మీద పునాదులు వేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైసీపీనే., తండ్రి చావుని కూడా ప్రచారం చేసుకుంటూ ఓదార్పు యాత్ర పేరుతో మీ నాయకుడు రాష్ట్రమంతా తిరుగుతున్నప్పుడు గుర్తులేదా సాయి రెడ్డి నీకు చావులను వివాదాలలోకి తీసుకురాకూడదని అంటూ తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో జగన్ ఓదార్పు యాత్ర చిత్రాలతో పోస్ట్ లు పెడుతూ అటు విజయసాయికి ఇటు వైసీపీకి గట్టి కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు.

‘నత్తి పకోడీ, నువ్వు కలిసి ఎయిడ్స్ తో పోయిన వాళ్ళని మహామేత కోసం పోయారంటూ గగ్గోలు పెట్టిన విషయం మర్చిపోతే ఎలా జ్యూమాంజీ ! డబ్బులిచ్చి నాన్న కోసం చనిపోయారని చెప్పించి ఓదార్చిన దగుల్బాజీలు మీరు’ అంటూ అయ్యన్న పాత్రుడు విజయసాయిరెడ్డితో పాటు జగన్ కు కూడా కౌంటర్ ట్వీట్ తో బదులిచ్చారు.

తండ్రి చావుని చూపిస్తూ జగన్ తాన రాజకీయ భవిష్యత్ కు బాటలు వేసుకున్న మాట నిజం కాదా? తల్లిని – చెల్లిని తన రాజకీయ ఎదుగుదలకు వాడుకొని తానూ అధికారంలోకి వచ్చాక వారిని పక్క రాష్ట్రానికి పంపిన చరిత్ర జగన్ రెడ్డిది కాదా? 2019 ఎన్నికల సమయంలో బాబాయ్ దారుణ హత్యను గుండెపోటుగా చిత్రీకరించిన ఘనత మీది కాదా? స్వయంగా జగన్ మీదనే కోడికత్తితో హత్యాయత్నం అంటూ డ్రామా నిజం కాదా? అంటూ టీడీపీ సోషల్ మీడియా మంచి స్వింగ్ లో విజయసాయిరెడ్డికి సెటైర్లు పేలుస్తున్నారు.

‘తండ్రి చావుతో రాజకీయ క్రీడను మొదలుపెట్టి బాబాయ్ చావుతో’ ఆ క్రీడలో గెలుపును సాధించిన జగన్ రెడ్డి కంటే రాజకీయ రాబందులు ఎవరుంటారని టీడీపీ పార్టీ ముఖ్య నేతలు వైసీపీకి ఘాటైన బదులిచ్చారు. చావుల గురించి., శవ రాజకీయాల గురించి వైసీపీ నేతలు నీతులు చెప్తుంటే “దెయ్యాలు వేదాలు వల్లించిన” చందంగా ఉంటుంది పరిస్థితి అంటూ రచ్చ రచ్చ చేస్తోంది టీడీపీ సోషల్ మీడియా వింగ్.