వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన
పాత్రల్లో నటిస్తున్న సినిమా “ముఖచిత్రం”. కలర్ ఫొటో మూవీతో హిట్ కొట్టిన
దర్శకుడు సందీప్ రాజ్ ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే, మాటలు
అందిస్తున్నారు. కాల భైరవ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత ఎస్
కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల
ముఖచిత్రం సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాతో గంగాధర్ అనే కొత్త
దర్శకుడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ఫన్ అండ్ ఇంటెన్స్
డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
గురువారం ముఖచిత్రం సినిమాలోని క్లాస్ రూమ్ లో లిరికల్ సాంగ్ ను సంగీత
దర్శకుడు థమన్ విడుదల చేశారు. పాట చాలా బాగుందన్న థమన్ చిత్రబృందానికి
బెస్ట్ విశెస్ తెలిపారు.
ఈ పాట ఎలా ఉందో చూస్తే…నువ్వెక్కడుంటే నేనక్కడుండా నువ్వంటే నాకు ఎంత
ఇష్టమో. ప్రతి ఒక్క చోటా అతుక్కు పోతా నీ నుంచి దూరం ఎంత కష్టమో. మాథ్స్
లో నీ ఊసులేగా, సైన్స్ లో నీ ఊహలేగా..ప్రేమగా నీ కలలు కన్నా, పాటమే
తలకెక్కదన్నా, నిండుగా నిను చదువుకుంటున్నా…క్లాస్ రూములో
మనం..కారిడార్ లో మనం..ఆటపాటలో మనం..అన్ని వైపులా మనం..లంచ్ బ్రేక్ లో
మనం..లాస్ట్ బెంచ్ లో మనం..బ్లాక్ బోర్డులో మనం…ఏకమైన మనసులం.. ఇలా
విద్యార్థి జీవితపు ప్రేమకథను అందంగా రచించారు రామజోగయ్యశాస్త్రి.
కాలభైరవ సంగీతాన్ని సమకూర్చడంతో పాటు సింధూరి విశాల్ తో కలిసి పాడారు.
దర్శకుడు సందీప్ రాజ్ “కలర్ ఫొటో” సినిమాలో తరగది గది దాటి పాట సూపర్
హిట్ అయ్యింది. ఇప్పుడు ఆయన కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్న
ముఖచిత్రం సినిమాలోనూ క్లాస్ రూమ్ లో పాట ఆ ఫీల్ తోనే సాగుతూ
ఆకట్టుకుంటోంది.
నటీనటులు – వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్
సాంకేతిక నిపుణులు – సంగీతం – కాల భైరవ, ఎడిటింగ్ – పవన్ కళ్యాణ్, సమర్పణ
– ఎస్ కేఎన్, నిర్మాతలు – ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల, కథ స్క్రీన్ ప్లే
మాటలు – సందీప్ రాజ్, దర్శకత్వం – గంగాధర్.
Comments: Success Has Gone Into Thaman’s Head
Neel Will Take Over Number One Spot From Rajamouli